ఐస్ తో ‘77’..అమితాబ్ కు బర్త్ డే శుభాకాంక్షలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నేటితో 77వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ముంబైలోని బిగ్ బీ నివాసానికి చేరుకుంటున్నారు. ఓ అభిమాని అమితాబ్ వేషధారణలో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. కొల్హాపూర్ కు చెందిన ఓ కళాకారుడు మంచుతో 77 వసంతాలను రూపొందించి బిగ్ బీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

Leave a Comment