సమ్మెతో గ్రేటర్‌ ఆర్టీసీకి రూ.12 కోట్లు నష్టం

ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రేటర్‌ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో కుదేలవుతున్నది. ఈ నెల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రేటర్‌ ఆర్టీసీ ఐదు రోజుల్లో రూ.12 కోట్లు నష్టపోయింది. పండుగ సమయంలో లాభమార్జించే అవకాశం ఉన్నప్పటికీ సమ్మెబాట పట్టడంతో ఆర్టీసీ ఆదాయాన్ని క్యాబ్‌లు, ఆటోరిక్షాలు, ఎంఎంటీఎస్‌, మెట్రోరైలు , ఇతర ప్రైవేటు ఆపరేటర్ల పరమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మె నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ కార్మిక సంఘాలు మెట్టుదిగక పోవడంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. హైర్‌ బస్సులతోపాటు, ప్రైవేటు బస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు, పర్యాటకశాఖ, విద్యాసంస్థల బస్సులను రంగంలోకి దించి ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టింది.

Related posts

Leave a Comment