‘డిస్కోరాజా’ మొదటిపాట విడుదలకు టైం ఫిక్స్

టాలీవుడ్ యాక్టర్ రవి తేజ ‘డిస్కోరాజా’గా అభిమానులకు వినోదాన్ని పంచేందుకు సిద్దమవుతోన్న విషయం తెలిసిందే. విఐ ఆనంద్ దర్సకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన డిస్కోరాజా ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. చిత్రయూనిట్ అక్టోబర్ 19న డిస్కో రాజా మ్యూజిక్ ఆల్బమ్ నుంచి తొలి పాటను విడుదల చేయనుంది.

థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం లో మాస్ మహారాజ రవితేజ కు జోడీగా పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ మరోసారి తన హిలేరియస్ కామెడీ తో ప్రేక్షకులను నవ్వుల విందు పంచనున్నాడు. బాబీ సింహా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related posts

Leave a Comment