ఆయుష్మాన్‌ భారత్‌ కన్నా ఆరోగ్యశ్రీ మిన్న

కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకంతో తెలంగాణలో 24 లక్షల మందికే లబ్ధి చేకూరుతున్నదని, ఆరోగ్యశ్రీ వల్ల 85 లక్షల మంది ఉచిత వైద్య సేవలు పొందుతున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరగనున్న సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సమావేశం గురువారం ఢిల్లీలో ప్రారంభమైంది. ఆయుష్మాన్‌ ద్వారా చికిత్సల్లో అత్యధికంగా రూ.5 లక్షలే ఇస్తున్నారని ఈ సందర్భంగా ఈటల తెలిపారు. కానీ తాము మూత్రపిండాలు, గుండె మార్పిడి వంటి అత్యంత వ్యయంతో కూడుకున్న చికిత్సలకూ డబ్బులు ఇస్తున్నామని, వీటికి రూ.13 లక్షల వరకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు కేంద్రం మరింత మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. గ్రామాల నుంచి పట్టణ స్థాయి వరకు పేద ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించాలన్న అంశంపై చర్చించామని వెల్లడించారు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదని, ఇకపై స్కాంలకు ఆస్కారం లేకుండా చూస్తామంటూ ఈఎ్‌సఐ కుంభకోణంపై అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.

Related posts

Leave a Comment