స్వచ్ఛ పల్లెల కోసం ‘క్యాలెండర్‌’

స్వచ్ఛ పల్లెల కోసం సంవత్సరం క్యాలెండర్‌ రూపొందించుకొని ప్రతీ నెలలో ఒక వారం పారిశుధ్యంతోపాటు ఒక ప్రత్యేక థీమ్‌తో కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. బుధవారం సిరిసిల్ల లో మాట్లాడుతూ పారిశుధ్యం, ఇంకుడు గుంతలు శిథిల భవనాల తొలగింపు, ప్రమాదకర బావుల పూడ్చివేత, ఇంటింటా చెత్త సేకరణ వంటి ప్రత్యేక థీమ్‌తో కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. వినూత్న మార్గాలతో ప్రజల భాగస్వామ్యంతో పల్లెల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. గ్రామ ప్రత్యేక ప్రణాళిక నిరంతరం కొనసాగేలా ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. కుల సంఘాల సభ్యులు, మహిళ సంఘాలు, యువతను సంఘటిత పరిచి స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు. అన్ని గ్రామాల్లో డం పింగ్‌ యార్డులను ఏర్పాటు చేయాలని, వ్యర్థాల విభజన, వాటిని తొలగించడం సక్రమంగా జరగాలని అన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ పరంగా సహకారం అందించి చెత్త నిర్వహణ బాధ్యతలు అప్పగించి వాటి నుంచి ఆదాయం పొందేలాగా ప్రోత్సహించాలన్నారు. మండల కేంద్రాల్లో ప్రధాన రోడ్డుమార్గాలను స్వీపింగ్‌ యంత్రాలతో క్లీన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

Related posts

Leave a Comment