రవిప్రకాశ్ ను పరామర్శించేందుకు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైదరాబాదులోని చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. జైల్లో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను పరామర్శించి, సంఘీభావం తెలపనున్నారు. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో రవిప్రకాశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిధులను అక్రమంగా దారి మళ్లించారంటూ ఆ ఛానల్ ప్రస్తుత యాజమాన్యం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా… న్యాయమూర్తి రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీని విధించారు. దీంతో, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు రవిప్రకాశ్ కు సంఘీభావం తెలుపుతున్నారు.

Related posts

Leave a Comment