సానియామీర్జా చెల్లెలి పెళ్లి…వరుడు ఎవరంటే…

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలైన ఆనంమీర్జా పెళ్లి కూతురు కానుందా? అవునంటున్నారు ఆనంమీర్జా తన ఇన్ స్టాగ్రాం పోస్టులో…

హైదరాబాద్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలైన ఆనంమీర్జాను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసద్ పెళ్లాడనున్నట్లు సమాచారం. అసద్,ఆనందమీర్జాల వివాహం ఈ ఏడాది డిసెంబరులో స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో జరగనుందని వెల్లడైంది. గతంలో ఆనం, అసద్ లు చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. ఎట్టకేలకు ఆనంమీర్జా తాను ‘‘కాబోయే వధువు’’అంటూ తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. గతంలోనూ ఆనం, అసద్‌లు తాము చెట్టాపట్టాలేసుకొని దుబాయ్‌లో తిరిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. గతంలో అసద్, ఆనంలు ఒకరికొకరు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తన జీవితంలో అసద్ అత్యంత అద్భుతమైన వ్యక్తి అంటూ ఆనంమీర్జా వ్యాఖ్యానించారు.ఆనంమీర్జా ఫ్యాషన్ స్టైలిస్టుగా ‘లబేల్ బజార్’ పేరిట ఫ్యాషన్ ఔట్ లెట్ నిర్వహిస్తున్నారు. అజారుద్దీన్ కుమారుడైన అసద్ వర్థమాన న్యాయవాది. వీరిద్దరి వివాహంతో రెండు క్రీడా కుటుంబాల మధ్య ఉన్న స్నేహం కాస్తా బంధుత్వంగా మారనుంది.

Related posts

Leave a Comment