టీఎస్‌ఆర్‌టీసీ కార్మికుల సమ్మెకు మావోయిస్టులు మద్దతు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మూడు రోజులుగా చేస్తున్న సమ్మెకు మావోయిస్టులు మద్దతు పలికారు. కార్మికులు తమ కోర్కెలు సాధించుకునే వరకు పోరాటం ఆపవద్దని పిలుపునిచ్చారు. అవసరమైతే మిలిటెంట్‌ పోరాటం చేయాలని సూచించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్‌ బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎదుర్కొంటున్న నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు. చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచడం వల్లే సంస్థ నష్టాలు ఎదుర్కొంటోందన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఆలోచన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉందని, ఈ కారణంగానే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గా ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Related posts

Leave a Comment