నేడు ఢిల్లీకి జగన్.. మోదీతో కీలక భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. భేటీ సందర్భంగా ఆర్థికంగా ఇక్కట్లలో ఉన్న ఏపీకి నిధులు ఇచ్చి ఆదుకోవాలని ప్రధానిని జగన్ కోరనున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల ఆదా అయిన నిధుల గురించి వివరించనున్నారు. పోలవరంకు గత టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను విడుదల చేయాలని కోరనున్నారు. వివిధ శాఖలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కూడా కోరనున్నారు. విద్యుత్ సంస్థల పీపీఏలపై సమీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే కేంద్ర నుంచి పలు లేఖలు వచ్చిన నేపథ్యంలో, ఈ అంశంపై కూడా ప్రధానికి వివరించనున్నారు. కడప స్టీల్ ప్లాంట్, రాష్ట్రానికి మేజర్ పోర్టు, వెనుకబడిన జిల్లాలకు నిధుల అంశాన్ని కూడా చర్చించనున్నారు.

Tags: Jagan Narendra Modi Delhi Tour BJP YSRCP Polavaram

Related posts

Leave a Comment