కేటీఆర్ డైనమిక్ మినిస్టర్

హైదరాబాద్‌కు వచ్చే కంపెనీలకు దగ్గరుండి ప్రోత్సాహం అందిస్తున్నారంటూ మంత్రి కేటీఆర్‌ను అమితాబ్‌కాంత్ అభినందించారు. కేటీఆర్ వెరీవెరీ డైనమిక్ మినిస్టర్.. మోస్ట్ డైనమిక్ మినిస్టర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కేటీఆర్‌తో కలిసి పనిచేసిన అనుభవం తనకున్నదని, ఆయనతో పనిచేయడం అదృష్టమని చెప్పారు. గతంలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ (జీఈఎస్) సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక హాజరైన కార్యక్రమంలో కేటీఆర్ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. జీఈఎస్‌ను అత్యద్భుతంగా నిర్వహించారని కేటీఆర్‌ను ప్రశంసించారు. కేటీఆర్ గ్రేట్ కాటలిస్ట్, ఫెసిలిటేటర్ అన్నారు. ఇలాంటి నాయకుడున్న హైదరాబాద్‌ను ఎంచుకోవడంపట్ల మైక్రాన్‌ను అభినందించారు. ప్రపంచంలో ఎక్కడా దొరుకని ఆతిథ్యం ఇక్కడ దొరుకుతుందని చెప్పారు.

కంపెనీలు, సంస్థల ఏర్పాటుకు దేశంలో హైదరాబాద్‌ను మించినప్రాంతం మరొకటిలేదని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ చెప్పారు. శుక్రవారం మాదాపూర్ ైస్కెవ్యూలో మైక్రాన్ డెవలప్‌మెం ట్ సెంటర్‌ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంపై, మం త్రి కేటీఆర్‌పై అమితాబ్‌కాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. కేటీఆర్‌ను వెరీవెరీ డైనమిక్ మినిస్టర్ అని అభివర్ణించారు. ప్రపంచంలోని అగ్రశేణి కంపెనీలన్నీ ఇన్నోవేషన్, ఇంజినీరింగ్, పరిశోధన- అభివృద్ధి కార్యాలయాల కేంద్రాలను హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నాయని, ప్రపంచంలోని అత్యత్తమ వినూత్న ఆవిష్కరణలన్నీ ఇక్కడినుంచే సాగుతున్నాయని చెప్పారు.

Tags: KTR, Amitabkanth, Dynamic leader

Related posts

Leave a Comment