పండుగ ఎఫెక్ట్‌..! ఆర్టీసీ బాదుడు..!!

దసరా పర్వదినాన్ని ఎన్‌‘క్యాష్‌’ చేసుకునేం దుకు ఆర్టీసీ అమలుచేస్తున్న 50శాతం అ‘ధ నం’ ప్రయాణికుల నడ్డి విరుస్తోంది! అదనపు చార్జీ సంస్థకు కాసులు కురిపిస్తుంటే.. ప్రయా ణికులు మాత్రం నిలువు దోపిడీకి గురవుతు న్నారు. విజయవాడ నుంచి దూరప్రాంతాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, రాజ మహేంద్రవరంలకు ప్రత్యేక బస్సులలో వెళ్ళా లంటే మోత మోగుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే దూరప్రాంతాల నుంచి రాకపోకల కోసం షెడ్యూల్‌ బస్సుల్లో సీట్లకు ముందస్తుగా రిజర్వేషన్‌ జరిగి పోయింది. దీంతో ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ అధికారులు దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని 600కు పై గా ప్రత్యేక బస్సులను తిప్పటానికి ప్లానింగ్‌ చేశారు. సెప్టెంబరు 28నుంచి స్పెషల్‌ బస్సు లకు సైతం అడ్వాన్స్‌ బుకింగ్‌ కల్పించారు. షెడ్యూల్‌ బస్సులలో సీట్లన్నీ హాటుకేకు మాదిరిగా బుక్‌ అయిపోవటంతో ప్రయాణికు లకు ప్రత్యేక బస్సులే గత్యంతరం అవుతున్నా యి. ప్రత్యేక బస్సులలో ఆర్టీసీ 50శాతం అద నంగా చార్జీలను వసూలు చేస్తోంది. నిర్ణీత రూట్‌ మొత్తం చార్జీలో సగం చార్జీ అదనంగా కలిపి వసూలుచేయటం వల్ల పండగకు రాక పోకలు సాగించే ప్రయాణికులకు పెనుభా రంగా మారింది.

స్పెషల్‌ బాదుడు ఇలా…
విజయవాడ నుంచి హైదరాబాద్‌ మార్గం లో ప్రధానంగా ఎంజీబీఎస్‌, కేపీహెచ్‌బీలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. విజ యవాడ నుంచి ఎంజీబీఎస్‌కు అమరావతి బస్సులలో సాధారణ చార్జీ రూ.660గా ఉంది. దీనికి 50శాతం అదనం కలిపి ప్రస్తుతం రూ. 990వసూలు చేస్తున్నారు. ఇదే రూట్‌లో గరు డ బస్సులలో సాధారణ చార్జీ రూ.575గా ఉంటే ప్రత్యేకబస్సుల పేరుతో రూ.865 వసూ లు చేస్తున్నారు. ఇదే రూట్‌లో ఇంద్రబస్సుల లో సాధారణ చార్జీ రూ.500ఉండగా.. స్పెషల్‌ ఫేర్‌ మాత్రం రూ.750గా ఉంది. సూపర్‌ లగ్జరీ బస్సులలో సాధారణ చార్జీ రూ.375 కా గా స్పెషల్‌ ఫేర్‌ రూ.565గా ఉంది. విజయ వాడ నుంచి హైదరాబాద్‌ రూట్‌లో కేపీ హెచ్‌బీకి చూస్తే అమరావతి బస్సులలో సాధారణ చార్జీ రూ.700 ఉంటే.. స్పెషల్‌ ఫేర్‌ రూ.1050గా ఉంది. గరుడలో సాధారణ చార్జీ రూ.610కాగా స్పెషల్‌ ఫేర్‌ రూ.915గా ఉంది. ఇంద్ర బస్సులలో సాధారణ చార్జీ రూ.535 కాగా స్పెషల్‌ ఫేర్‌ రూ.805గా ఉంది. సూపర్‌ లగ్జరీ బస్సులలో సాధారణ చార్జీ రూ.400 ఉండగా స్పెషల్‌ ఫేర్‌ రూ.600గా ఉంది. విజ యవాడ నుంచి విశాఖపట్నం రూట్‌లో అమ రావతి బస్సులలో సాధారణ చార్జీ రూ.870 కాగా, ప్రత్యేక చార్జీ రూ.1305గా ఉంది. గరు డ బస్సులలో సాధారణ చార్జీ రూ.690 కాగా స్పెషల్‌ ఫేర్‌ రూ.1035గా ఉంది. ఇంద్ర బస్సు లలో సాధారణ చార్జీ రూ.660గా ఉండగా ప్రత్యేక చార్జీగా రూ.990 వసూలు చేస్తున్నా రు. సూపర్‌ లగ్జరీ బస్సులలో సాధారణ చార్జీ రూ.495కాగా, స్పెషల్‌ ఫేర్‌ రూ.745గా ఉంది. విజయవాడ నుంచి తిరుపతికి అమరావతి బస్సులలో సాధారణ చార్జీ రూ.960 కాగా, స్పెషల్‌ ఫేర్‌ రూ.1440గా ఉంది. గరుడ బస్సులలో సాధారణ చార్జీ రూ.835 కాగా, స్పెషల్‌ ఫేర్‌ రూ.1255 ఉంది. ఇంద్ర బస్సుల లో సాధారణ చార్జీ రూ.725 కాగా స్పెషల్‌ ఫేర్‌ రూ.1090గా ఉంది. విజ యవాడ నుంచి రాజమహేంద్రవరం రూట్‌లో అమరావతి బస్సులలో సాధారణ చార్జీ రూ.400 కాగా, స్పెషల్‌ ఫేర్‌ రూ.600గా ఉంది. గరుడ బస్సు లలో సాధారణ చార్జీ రూ.325 కాగా, స్పెషల్‌ ఫేర్‌ రూ.490గా ఉంది. ఇంద్ర బస్సులలో సాధారణ చార్జీ రూ.310 కాగా స్పెషల్‌ చార్జీ 465గా ఉంది. సూపర్‌ లగ్జరీ బస్సులలో సాధారణ చార్జీ రూ.225కాగా ప్రత్యేక చార్జీగా రూ.340 వ సూలు చేస్తున్నారు.

Related posts

Leave a Comment