నేడు బీజేపీలోకి టీడీపీ సీనియర్‌ నేత దేవేందర్‌ గౌడ్‌ తనయుడు

ఓవైపు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో సత్తాచాటి పార్టీలో పునరుత్తేజానికి కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తుంటే ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరూ జారిపోయి షాకిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఢిల్లీలో ఈ రోజు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా సమక్షలో ఆయన కమదళంలోకి చేరుతున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే తెలంగాణ తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వీరేందర్‌గౌడ్‌ కాషాయం కండువా కప్పుకునేందుకు ఎప్పుడో సిద్ధమయ్యారు. అందుకే పదవికి రాజీనామా చేస్తూ పార్టీపై విమర్శలు కూడా గుప్పించిన విషయం విదితమే. రాజకీయ అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు.

Related posts

Leave a Comment