చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

తిరుపతి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు-బెంగళూరు హైవేపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమండంతో అందులో ఉన్న ఐదుగురూ సజీవ దహనమయ్యారు. చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం మామడుగు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులు జాహ్నవి, కళ, భానుతేజ, పవన్ సాయి, ఆశ్రితగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

Leave a Comment