బడ్జెట్ ఎంపీ విజయసాయిరెడ్డికి ఢిల్లీలో కీలక పదవి…

పార్లమెంటరీ స్థాయి సంఘాలను స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. శనివారం ఉదయం లోక్‌సభ స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించారు. ఈ కీలక పదవి విజయసాయికి వరించడంపై వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

కాగా.. ఈ కమిటీలో మాగుంట శ్రీనివాసులురెడ్డి, నామా, కేశినేని నానిని సభ్యులుగా నియమిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. పరిశ్రమల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా కేకేను, పరిశ్రమల వ్యవహారాల పార్లమెంటరీ సభ్యుడిగా అవినాష్ రెడ్డిని నియమిస్తున్నట్లు ఓం బిర్లా తెలిపారు. ఇదిలా ఉంటే.. రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్థాయి సంఘం చైర్మన్‌గా టీజీ, పార్లమెంట్ వ్యవహారాల ఆర్థికశాఖ సభ్యులుగా మిథున్‌రెడ్డి, సీఎం రమేష్‌ను నియమిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. మొత్తానికి చేస్తే తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలో కీలక పదవులు వరించడం విశేషం.

Related posts

Leave a Comment