రోడ్డుపై వరినాట్లు పెడుతూ వినూత్న రీతిలో డీకే అరుణ నిరసన

మాజీ మంత్రి,బీజేపీ నేత డీకే అరుణ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పాడైన రోడ్లు,ఏళ్లు గడుస్తున్నా పూర్తి కానీ ఆర్వోబీ నిర్మాణంపై డీకే అరుణ నిరసన తెలియజేశారు. రోడ్డుపై వరినాట్లు పెడుతూ వినూత్న రీతిలో ప్రభుత్వానికి నిరసన తెలిపారు.జిల్లా కేంద్రంలోని స్థానిక రైల్వే గేట్-2 వద్ద

గురువారం ఆమె నిరసన కార్యక్రమం చేపట్టారు. పాడైన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారని అన్నారు. ఐదేళ్లుగా ఆర్వోబీ నిర్మాణం జరుగుతూనే ఉందని.. ఇప్పటికైనా దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. డీకే అరుణ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక బీజేపీ

కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఇటీవల డీకే అరుణ ఆరోపించారు.మూడేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్..ఆరేళ్లయినా పూర్తి చేయలేదన్నారు. ఇప్పుడు కూడా 8 నెలలు లేదా సంవత్సరం లోపు పూర్తి చేస్తామని కచ్చితత్వం లేని

మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.పాలమూరు రంగారెడ్డి డిజైన్ మార్చి.. అడ్డగోలుగా అంచనా వ్యయాన్ని పెంచేశారని ఆరోపించారు.పాలమూరుకు కేసీఆర్ పెద్ద దరిద్రంగా దాపురించారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

Related posts

Leave a Comment