వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా దృష్టి

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కేసు విచారణపై ఆరా తీసేందుకు నిన్న కడవ వచ్చిన సవాంగ్… ఈ రోజు కూడా అక్కడే ఉండి కేసు విచారణ తీరుపై స్థానిక పోలీసులను సమీక్ష

నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సిట్ 1300 మందిని విచారించింది. అయితే కేసులో అనుమానితుడిగా విచారణ ఎదుర్కొన్న శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కేసును కొత్త మలుపు తిప్పింది.

అయితే శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్య కేసును అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు… దీనిపై విచారణ జరుపుతున్నారు. ఇదే అంశంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్థానిక పోలీసులపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అనుమానితుడిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి కదలికలపై ఎందుకు నిఘా

పెట్టలేదని ఆయన పోలీసులను అడిగినట్టు సమాచారం. ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్న శ్రీనివాసులురెడ్డి కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పరమేశ్వర్ రెడ్డికి సమీప బంధువు కావడం కూడా అతడి ఆత్మహత్యపై అనుమానాలు మరింతగా పెరిగేలా చేస్తోంది. దీంతో శ్రీనివాసులురెడ్డి

మృతిపై రెండో రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీ సవాంగ్ స్థానిక పోలీసులను ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తానికి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఆలస్యమవుతుండటంతో స్వయంగా ఏపీ డీజీపీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

Related posts

Leave a Comment