తెలంగాణలో యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమ౦…ఎంపీ ధర్మపురి అరవింద్

తెలంగాణలో యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. తన కుమార్తె కవితను ఓడించినందుకే ఇక్కడ రైతులపై ఈ రకంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్రం యూరియాను నిల్వ చేసుకోవాలని ఎప్పటి నుంచో చెబుతున్నా… ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. తమకు యూరియా నిల్వ చేసుకోవడానికి గోదాములు లేవని చెప్పి… రాష్ట్ర ప్రభుత్వం యూరియాను తెప్పించుకోలేదని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు.

నిజామాబాద్ జిల్లాకు రావాల్సిన యూరియాను టీఆర్ఎస్ ముఖ్యనేతలు కామారెడ్డికి తరలించుకుపోయారని ఆయన ఆరోపించారు. దీనిపై జిల్లా మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఎంత కావాలంటే అంత యూరియా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఎంపీ దర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. రైతులు రోడెక్కకుండా ఉండాలంటే వెంటనే యూరియా సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

Related posts

Leave a Comment