రజినీకాంత్ అల్లుడి డబ్బు, పాస్‌పోర్ట్ దొంగతనం..

కొందరికి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. అలా చెప్తేనే వాళ్లను గుర్తు పడతారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ విశాగన్ పాస్ పోర్ట్ పోగొట్టుకున్నాడు అంటే ఎవరతను అంటారు. కానీ రజినీకాంత్ అల్లుడు విశాగన్‌కు అలా అయింది అంటే మాత్రం మరోలా ఉంటుంది. ఇప్పుడు ఇదే జరిగింది. నిజంగానే సూపర్

స్టార్ అల్లుడికి చెప్పుకోలేని కష్టం వచ్చింది. చిన్నల్లుడు విశాగన్ తన పాస్‌పోర్ట్, డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 11న చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్యతో ప్రముఖ బిజినెస్‌మెన్ విశాగన్ వివాహం జరిగింది.

ఈయనకు ఇదివరకే పెళ్లైంది.. కాగా తొలి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత సౌందర్యను పెళ్లి చేసుకున్నాడు. అలాగే సౌందర్య కూడా అంతే. 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను సౌందర్య పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2016లో వాళ్లు విడిపోయారు. వీళ్లకు ఆరేళ్ల కుమారుడు

కూడా ఉన్నాడు. ఇక మొన్నటికి మొన్న విశాగన్‌ను రెండో పెళ్లి చేసుకుంది సౌందర్య. కొచ్చాయాడన్‌, వీఐపీ 2 సినిమాలకు ఈమె దర్శకురాలు కూడా. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పర్సనల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ మధ్యే విశాగన్, సౌందర్య చెన్నై నుండి లండన్ వెళ్ళేందుకు టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో వారు లండన్‌లోని హెర్బ్యూ ఎయిర్ పోర్ట్‌కి చేరుకోగా.. ఇమ్మిగ్రేషన్ సమయంలో విశాగన్ తన పాస్‌పోర్ట్‌తో పాటు అమెరికన్ డాలర్స్‌ ఉన్న సూట్‌కేసు కూడా పోగొట్టుకున్నాడు. ఇదే

విషయాన్ని వెంటనే అక్కడే ఉన్న విమానాశ్రయ సిబ్బందికి ఫిర్యాదు చేసాడు. విశాగన్ కష్టం అర్థం చేసుకున్న భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి అతడికి ఓ డూప్లికేట్ పాస్‌పోర్ట్ సిద్ధం చేసిందని తెలుస్తుంది.

Related posts

Leave a Comment