ఇండియాలో చొరబడేందుకు 50 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ చెలరేగిపోతోంది. ఓ వైపు భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఎల్‌వోసీ వెంబడి కుట్రలు చేస్తోంది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపి విధ్వంసాలు సృష్టిందుకు వ్యూహ రచన చేస్తోంది. కశ్మీర్‌లో చొరబడేందుకు ప్రయత్నించిన

పాకిస్తానీలు ఖలీల్ అహ్మద్, మోజామ్ ఖోకర్‌లను భారత ఆర్మీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణలో వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది భారత సైన్యం. ఇండియాలో చొరబడేందుకు 50 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వారికి

పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.

వారి విచారణలో తెలిసిన వివరాల ప్రకారం…ఎల్‌వోసీ వెంబడి పెద్ద మొత్తంలో ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ శిక్షణ ఇస్తోంది. రేషియన్ గలీ, కద్లాన్ గలీ ద్వారా కశ్మీర్‌లోకి పంపించేందుకు వ్యూహాలు రచించారు. అంతేకాదు మరో 80 మంది SSG కమాండోలకు ముజఫర్‌బాద్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. వీరిని

హాజీపూర్ నాలా వద్ద ఉన్న భారత సాయుధ బలగాలను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తున్నారు. భారత ఆర్మీ నుంచి రక్షన పొందేందుకు జ్యూరా, జబ్బార్ లోయ ప్రాంతాల్లో ప్రత్యేకమైన బంకర్లను ఏర్పాటు చేశారు.

ఎల్‌వోసీ వెంబడి మూడు ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఉగ్రవాదులను మోహరించింది పాక్ సైన్యం. పీవోకేలోని లిపా లోయ ప్రాంతంలో సుమారు 100 మంది జైషే మహ్మద్, అల్బాదర్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారు. ఈ లిపా లోయ కశ్మీర్‌లోని యురీ, తంగ్‌ధర్ సెక్టార్లకు సమీపంలో ఉంటుంది.

మరో 70 మంది టెర్రరిస్టులు లంజోట్, కలు క్యాంపుల్లో ఉన్నారు. వీరికి పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. వీరంతా భారత సైన్యం, బీఎస్ఎఫ్ దళాల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు కాపలా దళాలను మరింత అప్రమత్తం చేసింది భారత్.

Related posts

Leave a Comment