ఎమ్మెల్యే శ్రీదేవికి ఎదురైన చేదు అనుభవంపై జగన్ సీరియస్…

Jagan meeting at Praja Vedika

గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం అనంతవరంలో ఎమ్మెల్యే శ్రీదేవికి ఎదురైన చేదు అనుభవంపై జగన్ సీరియస్ అయ్యారు.వినాయక మంటపం వద్ద ఆమెను కులం పేరుతో దూషించినవారిపై తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సుచరితను ఆదేశించారు.రాష్ట్రంలో ఏ మహిళకు ఇలాంటి

పరిస్థితి తలెత్తవద్దని చెప్పారు. బడుగు,బలహీన వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్లే వాతావరణం ఉండాలని సూచించారు.మహిళల గౌరవానికి భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. అలా అయితేనే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం

కావన్నారు. గురువారం పార్టీ ఎమ్మెల్యేలు శ్రీదేవి,ఆర్కే సీఎం జగన్,హోంమంత్రి సుచరితలతో సమావేశమైన సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.తుళ్లూరులో ఆరోజు తనకు జరిగిన అవమానం గురించి శ్రీదేవి జగన్‌కు వివరించారు.

ఇదిలా ఉంటే, శ్రీదేవి ఘటన విషయంలో వాస్తవాలను వక్రీకరించారంటూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆమెపై మండిపడ్డారు. వైసీపీ వాళ్లు చేసిన అల్లరిని టీడీపీకి అంటగట్టడం దారుణం అన్నారు.ఈ వివాదంలోకి చంద్రబాబు పేరును లాగిన శ్రీదేవి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్

చేశారు. శ్రీదేవి ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని.. మరి టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

Related posts

Leave a Comment