కేసీఆర్‌ను కలవరపెడుతున్న జగన్ నిర్ణయం

Jagan meeting at Praja Vedika

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలన ఇంకా పూర్తికాలేదు. పలు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. తన మేనిఫెస్టోను ముందు పెట్టుకుని వాటిని వరుసగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకునే కొన్ని

నిర్ణయాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరుకునపడేలా చేస్తున్నాయి. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ తీర్మానించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, అందులోని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించనున్నారు. సుమారు 52వేల మంది ఆర్టీసీ

కార్మికులు ఈ నిర్ణయం వల్ల లబ్ధిపొందనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి వేతనాలు, ఇతరత్రా పదవీవిరమణ ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. ఏపీలో ఇదో సంచలనంగా మారనుంది. అయితే, ఈ ప్రభావం తెలంగాణ మీద కూడా పడుతోంది.

తెలంగాణలో ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆర్టీసీ కార్మికులతో పాటు తెలంగాణ బీజేపీ కూడా ఈ డిమాండ్ చేస్తోంది. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయగలిగినప్పుడు ధనికరాష్ట్రం అయిన తెలంగాణలో మాత్రం ఎందుకు చేయలేరని తెలంగాణ

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల మనసుల్లో కూడా ఈ ఆలోచనే ఉంది. ఆర్టీసీ బస్సు డిపోల్లో ఏ ఇద్దరు కార్మికులు కలిసినా.. ‘ఏపీలో జగన్ ఆర్టీసీని విలీనం చేస్తున్నారట. మరి కేసీఆర్ కూడా చేస్తారా?’ అని చర్చించుకుంటున్నారు. అయితే,

దీనిపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.

2014 – 19 మధ్య తెలంగాణలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఏపీ మీద కూడా పడేది. కేసీఆర్ ఉద్యోగులకు వీఆర్ పెంచితే, ఏపీలో కూడా చంద్రబాబు పెంచక తప్పని పరిస్థితి నెలకొనేది. తెలంగాణలో కొన్ని పథకాలు తెస్తే, అవే పథకాలు పేర్లు మార్చి ఏపీలో కూడా ప్రభుత్వం

అమలు చేసేది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అనుబంధం వల్ల ఈ అనివార్యతలు తప్పలేదు. అయితే, ఆర్టీసీ విషయం మాత్రం కేసీఆర్‌కు కొంచెం తలనొప్పిగానే మారొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Related posts

Leave a Comment