నేటి నుంచీ ఏపీలో కొత్త ఇసుక పాలసీ…

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచీ కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం కొత్త విధి విధానాలు జారీ చేసింది. ఇసుక పాలసీ అమలు, ధరల నిర్ధారణ, 1966 చట్టంలో సవరణలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నాలుగు

వేర్వేరు జీవోలు జారీ చేసింది. ఇకపై ఏపీ ఎండీసీ (ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థ) అధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరుగుతాయి. ఇసుకను… రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు తరలించి… ఏపీ ఎండీసీ అమ్మకాలు చేపడుతుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం టన్ను ఇసుక ధరను

రూ.375గా నిర్ణయించింది. స్టాక్ యార్డుల నుంచి వాహనాల ద్వారా ఇసుక రవాణాకు ఛార్జీలను నిర్ణయించే బాధ్యత ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. అవినీతికి ఛాన్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో… ఆన్‌లైన్ లోనే ఇసుక అమ్మకాలు, నగదు చెల్లింపులు జరగనున్నాయి.

ప్రస్తుతానికి ఏపీవ్యాప్తంగా 102 ఇసుక రీచ్‌లను ప్రభుత్వం గుర్తించింది. జీపీఎస్ లేకుండా ఇసుకను తరలిస్తే భారీ జరిమానాలు విధించనుంది. ఏపీ దాటి ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించడానికి అనుమతి లేదు. ఇసుక రీచ్‌లు, స్టాక్ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసిన ప్రభుత్వం… పూర్తి

పారదర్శకంగా ఇసుక విధానం అమలవ్వాలని ఆదేశించింది. రిజర్వాయర్లు, డ్యామ్‌లు, బ్యారేజీల దగ్గర ఇసుక తవ్వకాలు జరిపే పనులను నీటి పారుదల శాఖ (ఇర్రిగేషన్)కు అప్పగించింది. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాలో వద్దో నిర్ణయించే బాధ్యత స్థానిక తహశీల్దార్లకు

అప్పగించింది. అందువల్ల ఇసుక విధానం అవినీతి రహితంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

Related posts

Leave a Comment