తూర్పు గోదావరి జిల్లా జ్యువెలరీ షాపులో భారీ దొంగతనం..

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడులో భారీ దొంగతనం జరిగింది. పక్కా ప్లాన్‌తో వచ్చిన దొంగలు జువెలరీ షాపు షట్టర్‌ను గ్యాస్ కట్టర్లతో కోసేసి రూ.15 లక్షల విలువైన అరకిలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో

పత్తిపాడులోని ధర్మవరం రోడ్డులో ఉన్న కనకమహాలక్ష్మి ఫ్యాషన్ జ్యువెలర్స్‌లోకి చొరబడి దొరికినంత దోచేశారు. దుకాణం షట్టర్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్‌ చేసి రేకును తొలగించారు. ఆ రంధ్రంలో నుంచి షాపు లోపలికి వెళ్లి ఆభరణాలు, వస్తువులను చోరీ చేశారు. కాగా, దొంగలు ఈ చోరీ పక్కా ప్లాన్‌తో

చేసినట్లు తెలుస్తోంది. గ్యాస్ కట్టర్ తెచ్చి షట్టర్‌ను కట్ చేసి దొంగతనం చేశారంటే.. ముందుగానే దుకాణాన్ని ఎంచుకుని రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.

దుకాణ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. దొంగతనాల్లో ఆరితేరినవారే ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.

Related posts

Leave a Comment