భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్ మన మార్కెట్లపై కనిపించింది. ఒక దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్… ఆ తరువాత కొద్దిగా కోలుకుంది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఆగస్టులో వాహనాల అమ్మకాలు కనిష్ట స్థాయికి పడిపోవడం వంటి అంశాలు మార్కెట్లపై ప్రతికూలం ప్రభావం చూపాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

ఎనిమిది ప్రధాన రంగాల వృద్ధి పడిపోవడం కూడా ఇన్వెస్టర్లు అమ్మకం వైపు మొగ్గుచూపేలా చేశాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జీడీపీ 5 శాతానికి పరిమితం కావడం స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రభుత్వం విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం బొగ్గు, చమురు, సహజ వాయువు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ సంబంధిత రంగాల్లో వృద్ధి తగ్గింది.

Related posts

Leave a Comment