తెలంగాణలో నేడూ భారీ వర్షాలు..

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని చోట్ల నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని, వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. మిడ్ మానేరు రిజర్వాయర్‌కు కూడా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తివేసి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. రాజధాని నగరంలో కూడా వానలు ముంచెత్తుతున్నాయి. వాతావరణం చల్లగా మారింది.

Related posts

Leave a Comment