ప్యాకేజీ ఆర్టిస్ట్ అంటూ… పవన్ కల్యాణ్‌పై మళ్లీ సెటైర్లు

pavankalyan

ఏపీ అధికార పార్టీ వైసీపీ మరోసారి .. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శల దాడి చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పవన్ కల్యాణ్ … చంద్రబాబును విమర్శిస్తూ…. ట్వీట్ల దాడికి దిగారు. ఇధ్దరిపై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యాలు చేశారు. ‘ యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు. ఆయనేమో ఎందుకు ఓడిపోయానో తెలియదంటాడు. రెండు చోట్ల అడ్రసు గల్లంతైన పార్టనరేమో కాలం కలిసొచ్చో, ఈవీఎంల చలవతోనే గెలిచారంటారు. ఆ 23 సీట్లలో ఆయనను, ఒక్క స్థానంలో పార్ట్‌నర్‌ను ఎవరు గెలిపించారో? అంటూ పవన్ కల్యాణ్, చంద్రబాబుపై ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

తాను ఎందుకు ఓడిపోయానో తెలియడం లేదని చంద్రబాబు చెబుతుంటే, కాలం కలిసిరావడం వల్ల, ఈవీఎంల వల్లే వైసీపీ గెలిచిందని ఆయన పార్టనర్ అంటున్నాడని విమర్శలు గుప్పించారు. మరి విజయసాయిరెడ్డి విమర్శలకు, టీడీపీ జనసేన ఎలాంటి సమాధానం చెబుతాయో చూడాలి. గత కొన్ని రోజులుగా ఏపీలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలంతా ట్విట్టర్ వేదికగా విమర్శలుు చేసుకుంటున్నారు. వైసీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన సోషల్ మీడియా వేదికగానే…  సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Related posts

Leave a Comment