అమరావతి భవితవ్యం తేలేది నేడే?

Jagan meeting at Praja Vedika

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే ఉంటుందా? లేకపోతే మారుతుందా? ప్రచారం జరుగుతున్నట్టు రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మారుతుందా? లేకపోతే అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా ఉంచి… మిగిలిన ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తారా? మంత్రుల మాటలే కానీ, అసలు సీఎం జగన్ మోహన్ రెడ్డి మనసులో ఏముంది? ఈ ప్రశ్నలు అన్నిటికీ మరికొన్ని గంటల్లో సమాధానం దొరికే అవకాశం ఉంది. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి సీఆర్డీఏ అధికారులతో సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణం సీఆర్డీఏ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. దీంతో సీఆర్డీఏ సమీక్షలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అమరావతి రాజధాని అయితే, వరదలకు మునిగిపోతుందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అమరావతిని మారుస్తున్నామని ఎక్కడైనా ప్రభుత్వం చెప్పిందా? అనేమాట తప్ప వైసీపీ ముఖ్యనేతల నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అసలు జగన్ మోహన్ రెడ్డి మనసులో ఏముందనే విషయాన్ని సీఆర్డీఏ సమీక్షలో సూచనప్రాయంగా బయటపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related posts

Leave a Comment