ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్… ఐదుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్ గఢ్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. అటవీప్రాంతంలో మరోసారి మావోలు, పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. నారాయణ్ పూర్ జిల్లాలో మావోయిస్టుల అలికిడిపై భద్రతాబలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన బలగాలు భారీఎత్తున కూంబింగ్ చేపట్టాయి. నారాయణ్ పూర్ అటవీప్రాంతంలో భద్రత బలగాలు ఉన్నారన్న సమాచారం గ్రహించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మావోలు కాల్పులు జరుపుతూ పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఇంకా అటవీ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు

Related posts

Leave a Comment