పోలవరంపై రివర్స్ టెండరింగ్ నిలుపుదలకు హైకోర్టు ఆదేశం

పోలవరంపై రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసిన జగన్‌ సర్కార్‌కు గట్టి షాక్ తగిలింది. హైడల్ ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్‌ను నిలుపుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. టెండరింగ్ ప్రక్రియపై ముందుకు వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.పోలవరం హైడల్ ప్రాజెక్ట్

టెండర్ రద్దుపై నవయుగ కంపెనీ సోమవారం హైకోర్టును ఆశ్రయించడంతో.. అదేరోజు ఇరు వర్గాల వాదనను విన్న కోర్టు తీర్పును బుధవారం వెల్లడించింది. హైడల్ ప్రాజెక్టు టెండర్ రద్దు విషయంలో ప్రభుత్వం వాదనను కోర్టు తోసిపుచ్చింది.ఇప్పటివరకు ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా

తాము టెండరింగ్ పనులు చేపట్టామని.. అలాంటిది అకారణంగా తమ కాంట్రాక్టు రద్దు చేశారని కోర్టు ముందు నవయుగ తమ వాదనను వినిపించింది.అయితే హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఏపీజెన్‌కో తమకు స్థలాన్ని చూపించకపోవడం వల్లే ముందుకు వెళ్లలేకపోయామని నవయుగ కోర్టుకు

తెలిపింది. కాబట్టి ఆ జాప్యం ప్రభుత్వం వల్ల జరిగిందే తప్ప తమవల్ల పనుల్లో ఇలాంటి జాప్యం జరగలేదని స్పష్టం చేసింది.తమ కాంట్రాక్టును తిరిగి కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోర్టుకు ఆ సంస్థ విజ్ఞప్తి చేశారు.

కాగా,పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.4,987 కోట్లతో రివర్స్ టెండరింగ్‌కు ఇటీవలే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రూ.3,600 కోట్ల మేర అంచనాలు పెరిగాయని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లినట్టు ప్రభుత్వం

స్పష్టం చేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపింది.అయితే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ) మాత్రం ఈ నిర్ణయంతో విభేదించింది.అయినప్పటికీ జగన్ సర్కార్ మాత్రం రివర్స్ టెండరింగ్‌కే మొగ్గుచూపింది.

Related posts

Leave a Comment