ప్రతి 4 నిమిషాలకు ఓ మెట్రో రైలు… పాత రికార్డులు బ్రేక్

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభ వార్త. ఇకపై అమీర్ పేట నుంచీ హైటెక్ సిటీ వరకూ… ప్రతి 4 నిమిషాలకు ఓ ట్రైన్ సర్వీసులు అందించబోతోంది. ఇన్నాళ్లూ ఈ సదుపాయం లేకపోవడానికి బలమైన కారణం ఉంది. ఇప్పటివరకూ జూబ్లీ చెక్ పోస్టు నుంచి హైటెక్ సిటీ వరకు సింగిల్ లైన్

ద్వారా రైళ్లు నడిపింది మెట్రో. తాజాగా అక్కడ కూడా రివర్సల్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. అందువల్ల ఇకపై అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు ప్రతి 4 నిమిషాలకు ఓ రైలు… ఎల్బీనగర్ నుంచీ మియాపూర్ వరకు ప్రతి 5 నిమిషాలకు ఓ మెట్రో రైలు నడవనుంది. భవిష్యత్తులో ప్రతి మూడు

నిమిషాలకు ఓ ట్రైన్ నడిచేలా చేస్తామని చెబుతున్నారు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.ప్రస్తుతం మెట్రో రైలులో ఒక్క రోజులో ప్రయాణించే వారి సంఖ్య 3లక్షలు దాటింది. ఆగస్ట్ 15న ఏకంగా 3.6లక్షల మంది ప్రయాణించారు. జూన్ 7న మెట్రో రైళ్లలో 2.78 లక్షల మంది ప్రయాణించగా… జులై 22న

2.89 లక్షల మంది వెళ్లారు. ఆగస్ట్ 15న ఆ రికార్డు బద్ధలైంది.మెట్రో వల్ల చాలా లాభాలున్నాయి. ట్రాఫిక్ సమస్య ఉండదు. పొల్యూషన్ ఉండదు. హారన్ల గోల ఉండదు. ఎండ బాధ ఉండదు. అందుకే ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు అందరూ మెట్రో జర్నీ సూపర్ అంటున్నారు.

Related posts

Leave a Comment