తెలంగాణ బీజేపీలో చేరనున్న మరో కీలక నేత..

కొత్త చేరికలతో ఊపు మీదున్న తెలంగాణ బీజేపీ.. మున్ముందు ఆపరేషన్ కమలను మరింత విస్తృతం చేయనుంది.ఇప్పటికే ఓ జాబితా తయారుచేసుకుని మరీ.. ఒక్కో నాయకుడికి ఆ పార్టీ గాలం వేస్తూ పోతోంది. భవిష్యత్‌లో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడమే లక్ష్యంగా పావులు

కదుపుతోంది. ఇందులో భాగంగా సీనియర్ నేత దేవేందర్ గౌడ్‌తోనూ తాజాగా సంప్రదింపులు జరిపింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని దేవేందర్ గౌడ్ నివాసంలో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆయనతో చర్చలు జరిపారు. దేవేందర్ గౌడ్‌తో పాటు ఆయన కుమారుడు వీరేందర్ గౌడ్‌ను పార్టీలో చేరాలని

కోరారు.లక్ష్మణ్ విజ్ఞప్తిపై దేవేందర్ గౌడ్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దీంతో దేవేందర్ గౌడ్ రేపో మాపో బీజేపీలో చేరడం ఖాయమేనంటున్నారు.

ఇదిలా ఉంటే,బుధవారం ఢిల్లీ వెళ్లనున్న దేవేందర్ గౌడ్,వీరేందర్ గౌడ్ ‘సామాజిక న్యాయం’పై ఢిల్లీలోని కానిస్టిట్యూట్ క్లబ్‌లో నిర్వహించే సదస్సులో పాల్గొనున్నారు. అలాగే ఢిల్లీలోని బీజేపీ పెద్దలను కూడా దేవేందర్ గౌడ్ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌పై

బీజేపీ నుంచి స్పష్టమైన హామీ లభించిన తర్వాతే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి లాగడంలో.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సఫలమవుతున్నారు. టీఆర్ఎస్‌లోని అసంతృప్తి నేతలను కూడా పార్టీలోకి

లాగే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్‌లో సీట్లు దక్కని మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ,సోమారపు సత్యనారాయణ, మాజీ ఎంపీ వివేక్‌ వంటి వారిని ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. తాజాగా మరో ఇద్దరు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు

సమాచారం. మొత్తం మీద కొత్త చేరికలు తెలంగాణ బీజేపీలో జోష్ పెంచుతున్నాయనే చెప్పాలి

Related posts

Leave a Comment