విజిలెన్స్ అధికారినంటూ అధికార పార్టీ మహిళా నేత హల్‌చల్

మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో విజిలెన్స్ ఆఫీసర్‌ని అంటూ అధికార పార్టీ మహిళా నేత హల్‌చల్ చేసింది. తనిఖీల పేరుతో కంపెనీలకు వెళ్లి హడావుడి చేసింది. నిబంధనలు ప్రకారం కంపెనీలు లేవంటూ చిందులు తొక్కింది. డబ్బులు కట్టాలి లేదంటే

కేసులు బుక్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో అనుమానమొచ్చిన కంపెనీ యాజమాన్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అధికార పార్టీ మహిళా నేతను అదుపులోకి తీసుకున్నారు.

Related posts

Leave a Comment