పటాన్ చెఱు పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం. నిర్మల్ ఇండస్ట్రీస్ కెమికల్ కంపెనీ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. కంపెనీలో పెద్ద ఎత్తున కెమికల్ నిల్వ ఉండటంతో

మంటలు త్వరగా వ్యాపించాయి. దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా ? అన్న సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాక సిబ్బంది ఏడు ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పేందుకు

ప్రయత్నిస్తున్నారు. పెద్దఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతున్న పరిశ్రమ యజమానులు, అధికారులు ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Related posts

Leave a Comment