టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇల్లు కూల్చివేత

విశాఖకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాన్ని అక్రమంగా నిర్మించారని జీవీఎంసీ అధికారులు దగ్గరుండి కూల్చివేశారు. విశాఖలోని ద్వారకానగర్ మెయిన్‌రోడ్డులో పీలా గోవింద్ బహుళ అంతస్థుల భవనం నిర్మించుకున్నారు. అయితే సరైన అనుమతులు లేకుండా డ్రైన్ ఆక్రమించి భవనం నిర్మించారని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దీనికి సంబంధించి పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. కానీ దీనిపై ఎమ్మెల్యే వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రంగంలోకి దిగిన జీవీఎంసీ అధికారులు శనివారం ఉదయమే ఈ కూల్చివేత కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కూల్చివేతతో ద్వారకానగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా భారీగా పోలీసుల మోహరించారు.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై దృష్టిసారించిన సర్కార్.. కూల్చివేత షురూ చేసింది. కృష్ణానది కరకట్టపై ఉన్న ప్రజావేదిక కూల్చివేతతో ఏపీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. ఇప్పటికే విశాఖపట్నంతో పాటు పలు జిల్లాల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్నారు.

Related posts

Leave a Comment