చంద్రబాబు నాయుడు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు

Chandrababu-Naidu-

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి ఉండవల్లి వీఆర్వో వెళ్లారు. కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో… వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చేందుకు వీఆర్వో వెళ్లినట్లు సమాచారం. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వీఆర్వో అక్కడ వేచి చూస్తున్నారు.

మరోవూపు వీఆర్వోను… చంద్రబాబు ఇంట్లోకి అక్కడున్న సెక్యూరిటీ అనుమతించలేదు. చంద్రబాబు ఇంటితో పాటు కరకట్టపై మిగిలిన నిర్మాణాలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా కృష్ణానది కరకట్టపై భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కరకట్టపై ఉన్న

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇవాళ చంద్రబాబు ఇంటికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక పోతే… నిన్న ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద హైడ్రామా నడిచింది. చంద్రబాబు ఇల్లును ముంచడానికి కుట్ర చేస్తున్నారని పలువురు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వరద అంచనా కోసమంటూ తన ఇంటిపై డ్రోన్లు వినియోగించి, తన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేశారంటూ మాజీ

ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తోడుగా, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉండవల్లి ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది.ఇది వైసీపీ ప్రభుత్వం సృష్టించిన వరద అని.. వరద నీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Related posts

Leave a Comment