శ్రావణ మాసం ఎఫెక్ట్…దిగొచ్చిన చికెన్ ధరలు…

శ్రావణ మాసం దెబ్బకు కొండ మీద ఉన్న కోడి దిగొచ్చింది. నిజమే చికెన్ ధరలు అమాంతంగా పడిపోయాయి. సాధారణంగా శ్రావణ మాసాన్ని చాలా మంది పవిత్రంగా భావించి నెల రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో ఒక్కసారిగా గిరాకీ తగ్గడంతో చికెన్ ధరలు భారీగా పతనం

అయ్యాయి. సరిగ్గా నెల క్రితం చికెన్ ధర ఏకంగా రూ.300 వరకూ పలికింది. అయితే ప్రస్తుతం మాత్రం కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర ఏకంగా 160 రూపాయలకు పతనం అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలోని కేవలం హైదరాబాద్ ప్రతీ ఆదివారం 12 లక్షల నుంచి 15 లక్షల కిలోల దాకా చికెన్

అమ్ముడవుతుందని పౌల్ట్రీ ప్రతినిధులు తెలిపారు. అయితే శ్రావణ మాసం దెబ్బకు చికెన్ వినియోగం బాగా తగ్గిందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా రిటైల్ మార్కెట్లో నగరంలోని ఒక్కో దుకాణంలో ఆదివారం పూట చికెన్ వినియోగం 70 నుంచి 80 కేజీల వరకూ వినియోగం అవుతుందని

అయితే ఈ ఆదివారం మాత్రం కేవలం 50 కేజీల చికెన్ మాత్రమే అమ్ముడయ్యిందని దుకాణాదారులు వాపోతున్నారు. అయితే దిగొచ్చిన ధరలతో మాంసాహార ప్రియులు మాత్రం లొట్టలు వేసుకుంటున్నారు.

Related posts

Leave a Comment