100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి కాశ్మీర్ భారత్‌ నుంచి విడిపోతుంది

ఆర్టికల్ 370 రద్దుపై ఎండీఎంకే చీఫ్ వైకో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ విషయంలో తాను బీజేపీ, కాంగ్రెస్ వైఖరి సరిగ్గా లేదని వైకో అన్నారు. కాశ్మీర్ సమస్యలో 70 శాతం తప్పు బీజేపీది అయితే 30 శాతం తప్పు కాంగ్రెస్ ది ఉందని అన్నారు. అంతేకాదు కాశ్మీర్ పై బీజేపీ వాళ్లు బురద

జల్లి నానా రభస చేశారని విమర్శించారు. అలాగే 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి కాశ్మీర్ భారత్‌లో ఉండదని వైకో జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 రద్దుపై తమిళనాడు రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ అంశంలో సూపర్ స్టార్ రజినీ కాంత్

ప్రధాని మోదీ, అమిత్ షాలను పొగడ్తలతో ముంచెత్తితే, కమల్ హాసన్ మాత్రం విమర్శించారు. ఇక ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సైతం బీజేపీ వైఖరిని తప్పుపట్టింది

Related posts

Leave a Comment