భగ్గుమంటున్నాబంగారం ధరలు

దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.38,310 పలికింది. అలాగే 22 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.36,030గా పలికింది. ఇక ప్రభుత్వ సంస్థ ఎంఎంటీసీ జారీ చేసే 999 ప్యూరిటీ బంగారం 10

గ్రాముల ధర రూ.41,709 గా నమోదైంది. అలాగే కేజీ వెండి ధర రూ.52370గా పలికడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర 1500 డాలర్లకు పైగా ట్రేడవుతోంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో నెలకొన్న స్తబ్దత కారణంగా మదుపరులు బంగారం పెట్టుబడులపై

ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా స్పాట్ గోల్డ్ ధర 0.4 శాతం పెరిగి (ఒక ఔన్సు) 1502 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక అటు యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ సైతం 0.4 శాతం ఎగిసి ఒక ఔన్సు ధర 1514 డాలర్లుగా ట్రేడవుతోంది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధభయాల నేపథ్యంలో బంగారం మరింత ఎగిసే ప్రమాదం ఉందని యాక్టివ్ ట్రేడ్ ఎనలిస్ట్ కార్లో ఆల్బర్ట్ డీ కాసా తెలిపారు.

Related posts

Leave a Comment