నేడు శ్రీఅత్తి వరదరాజస్వామి వారిని దర్శనానికి వెళ్లనున్న కేసీఆర్…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇవాళ తమిళనాడులోని… కంచిలో ఉన్న శ్రీఅత్తివరదరాజ స్వామి ఆలయానికి వెళ్లున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచీ ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న కేసీఆర్… రోడ్డు మార్గంలో తమిళనాడు కాంచీపురం బయలుదేరతారు. మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీఅత్తివరదరాజ స్వామి వారిని దర్శించుకుంటారు. తిరిగి అక్కడ నుంచీ బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుగు ప్రయాణం అవుతారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వాధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ప్రస్తుతం అత్తివరదరాజస్వామి ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

40 ఏళ్లకు ఒకసారి జరిగే అత్తి వరదరాజస్వామి దర్శనం ఆగస్టు 17తో ముగుస్తుంది. ఆగస్టు 18న స్వామిని తిగిరి పుష్కరిణిలో భద్రపరుస్తారు. మళ్లీ 2059లోనే అత్తి వరదరాజ పెరుమాళ్‌ దర్శన భాగ్యం కలుగుతుంది. అందువల్లే ఈ ఆలయానికి ఇప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దర్శన భాగ్యాన్ని మిస్ అవ్వకూడదని భావిస్తున్నారు. ఇంతమంది భక్తులు వస్తుండటంతో ఆలయంలో తరచూ తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన తొక్కిసలాటలో భక్తులకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి.

Related posts

Leave a Comment