మాజీ సీబీఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై

pavankalyan

జనసేనకు గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీ కీలక నేత, మాజీ సీబీఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై కొట్టనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. లక్ష్మీనారాయణతో పాటు ఆయన అనుచరుడు గంపల గిరిధర్ కూడా జనసేనకు గుడ్ బై కొట్టనున్నారు. త్వరలో వారిద్దరూ బీజేపీలో చేరనున్నట్టు

సమాచారం. 2019 ఎన్నికలకు ముందు జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గంపల గిరిధర్ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు

రాజకీయ భవిష్యత్ ఉండదన్న ఉద్దేశంతో వారిద్దరూ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌లో అత్యంత కీలకమైన రాజకీయ కేసులను డీల్ చేసిన సమయంలో లక్ష్మీనారాయణకు పేరు వచ్చింది. ఆ సమయంలో డిప్యుటేషన్ మీద వచ్చిన లక్ష్మీనారాయణ ఆ

తర్వాత మహారాష్ట్ర కేడర్‌కు వెళ్లిపోయారు. కానీ, ఉద్యోగ విరమణకు కొన్ని రోజుల ముందే వాలంటరీగా తప్పుకొన్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయ ఆరంగేట్రం చేస్తారని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. టీడీపీలో చేరతారని కొన్నాళ్లు, బీజేపీ లేదా జనసేనలో చేరతారని భావించారు. అయితే, ఎన్నికల

ముందు వరకు సొంతంగా పర్యటనలు చేసి రైతుల సమస్యలను తెలుసుకున్న లక్ష్మీనారాయణ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జనసేనలో చేరారు.

Related posts

Leave a Comment