ఢిల్లీలోనే ఏపీ సీఎం జగన్…పులివెందుల, పెనుకొండ టూర్ రద్దు…

Jagan meeting at Praja Vedika

ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాటి పులివెందుల, పెనుకొండ పర్యటనలను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన గురువారం కూడా అక్కడే ఉండనున్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జగన్ రెండు రోజులే ఢిల్లీలో పర్యటించాల్సి ఉంది. బుధవారం రాత్రి ఆయన ఏపీకి బయలు

దేరాల్సి ఉంది. కానీ తన టూర్‌ను పొడిగించారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో పులివెందుల, పెనుకొండ టూర్‌ను రద్దు చేసుకున్నట్లు ఏపీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

బుధవారం ఏపీలో కియా కొత్త కారు ప్రారంభోత్సవం జరగనుంది. కియా ఎండీ, దక్షిణ కొరియా రాయబారి హాజరయ్యే ఆ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ వెళ్లాల్సి ఉంది. కానీ జగన్ ఢిల్లీలోనే ఉండనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హాజరుకానున్నారు. సీఎం ప్రసంగాన్ని ఆయన చదివి విన్పించనున్నారు.

మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో హోంమంత్రి అమిత్ షాను కలిసి విభజన హామీల అమలుపై చర్చించారు. అంతకు ముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోనూ జగన్

సమావేశమయ్యారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో ఏపీలో రహదారుల నిర్మాణంపై చర్చించారు. అటు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశమైన జగన్..రాష్ట్రానికి రావాల్సిని నిధులను మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జగన్ వెంట విజయసాయిరెడ్డితో పాటు పలువురు ఎంపీలు ఉన్నారు.

Related posts

Leave a Comment