కూచన్‌పల్లిలో చెక్‌డ్యామ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్

సీఎం కేసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మెదక్ జిల్లా కుచన్‌పల్లిలో చెక్‌డ్యాంను ప్రారంభించి మంజీర నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హవేళీ ఘణపూర్ మండలానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు సుభాష్. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాబోయే రోజుల్లో యావత్ తెలంగాణ సస్యశ్యామలం అవుందని ఆయన అన్నారు. మంజీరా నదిపై ప్రాజెక్టులు నిర్మించుకుందామని రైతులకు చెప్పారు.

మెదక్ జిల్లా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మెదక్ జిల్లా హవేళీ ఘణపూర్ మండలం కూచన్ పల్లి వద్ద రూ. 15.5 కోట్ల వ్యయంతో చెక్ డ్యాం నిర్మించారు. ఏడు నెలల్లోనే చెక్ డ్యాంను నిర్మించి ఈ వర్షాకాలంలోనే రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Related posts

Leave a Comment