కశ్మీర్ లోయలో 100 మంది అరెస్ట్..

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ లోయ నివురుగప్పిన నిప్పులా మారింది. శ్రీనగర్ సహా పలుప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యారు. కశ్మీర్ అంతటా పెద్ద మొత్తంలో భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా భారీగా మోహరించాయి. ఐతే పలు ప్రాంతాల్లో చెదరుమదురు ఘటనలు జరిగాయని…ఈ క్రమంలో సుమారు 100 మంది రాజకీయ నేతలు, ఆందోళనకారులను భద్రతా బలగాలు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఆందోళనల్లో పాల్గొన్న ఓ యువకుడిని భద్రతా దళాలు వెంబడించగా…తప్పించుకునే క్రమంలో అతడు జీలం నదిలో దూకి చనిపోయాడు. శ్రీనగర్‌లో పలు చోట్ల కాల్పులు శబ్ధం వినిపించినట్లు కొందరు స్థానికులు తెలిపారు. బుల్లెట్ గాయాలతో ఆరుగురు యువకులు ఆస్పత్రిలో చేరారని ఏఎఫ్‌పీ వార్తాసంస్థం వెల్లడించింది.

కాగా, ఆర్టికల్ 370 ప్రకటనకు ముందే మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాతో పాటు కొందరు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐతే సోమవారం రాజ్యసభలో అమిత్ షా ప్రకటన చేశాక ముఫ్తీ, అబ్దుల్లా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్వేషపూరిత వ్యాఖ్యలతో శాంతిభద్రతకు విఘాతం కలిగే అవకాముందని భావించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి హరినివాస్ ప్రాంతంలో నిర్బంధించారు.

Related posts

Leave a Comment