చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు…

Chandrababu-Naidu-

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదని చంద్రబాబు పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. పార్టీ ఘోర ఓటమిపై కూడా చంద్రబాబు పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడిందో ఇప్పటికీ ఎవరికీ అర్థంకావడం లేదని టీడీపీ అధినేత తెలిపారు. ప్రజలు 23 సీట్లు ఇచ్చేంత తప్పు తాను ఏమీ చేయలేదని ఆయన పార్టీ కార్యకర్తలతో అన్నారు. పట్టిసీమ నీళ్లు తాగారని… కానీ ఓటు వేయడం మర్చిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాలు ఇచ్చే ఆవును వదిలేసి దున్నను తెచ్చుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన మీద కోపంతో వైసీపీ ప్రభుత్వం అమరావతిని చంపేశారని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

Leave a Comment