తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయు గుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మరో మూడు రోజులకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే

అవకాశముంది.తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనావేసింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయు గుండంగా మారింది.

ఈ వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గర్లో ఒడిశాకు ఆగ్నేయ దిశగా 160 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరో 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.మరో 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు ఇది

ప్రయాణించవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు.దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనావేశారు.

తెలంగాణలో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గురువారం పలు చోట్ల, శుక్రవారం చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశముంది. బుధ, గురువారాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.బుధవారం

కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గురు,శుక్రవారాల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షం కురిసే అవకాశముంది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, గురువారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.రాయలసీమలో బుధవారం

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గురు,శుక్రవారాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు.

Related posts

Leave a Comment