కాంగ్రెస్‌కు షాకిచ్చిన విజయశాంతి…

జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతుంటే…ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మాత్రం బీజేపీ నిర్ణయాన్ని సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. జనార్థన్ ద్వివేది,

జ్యోతిరాధిత్య సింధియా వంటి నేతలు ఈ విషయంలో బీజేపీ నిర్ణయాన్ని సమర్థించడంతో… కాంగ్రెస్ పార్టీలో సరికొత్త గందరగోళం మొదలైంది. తాజాగా కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దును ఆ పార్టీ నేత విజయశాంతి సమర్థించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.

జమ్మూ-కశ్మీర్ విభజన బిల్లుతో పాటూ ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు రాహూల్ గాంధీ కుడిభుజం, కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించడం, కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించడం శుభపరిణామమని విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ- నెహ్రూ

కుటుంబానికి సన్నిహితుడైన జనార్ధన ద్వివేది కూడా కేంద్రం జమ్ము, కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారని గుర్తు చేశారు. ఇప్పుడు దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని జ్యోతిరాదిత్య సింధియా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా…దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదన్నది కాంగ్రెస్ సిద్ధాంతామని అన్నారు. కాంగ్రెస్ లోని మెజారిటీ కార్యకర్తలు జమ్ము- కశ్మీర్ విభజనతో పాటూ ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నారని విజయశాంతి తెలిపారు. వీరి అభిప్రాయలను

ప్రతిబింబించే విధంగా జనార్ధన ద్వివేదితో పాటూ జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలు కూడా కేంద్రం జమ్ము కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించినట్లు భావిస్తున్నానని అన్నారు. వీరిద్దరితో పాటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు చెందిన చాలా మంది నేతలు కశ్మీర్ విషయంలో కేంద్రం

తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించవచ్చని అభిప్రాయపడ్డారు.

Related posts

Leave a Comment