త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా..

రాష్ట్రంలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సోమవారం ప్రగతి భవన్‌లో అధికారులతో చర్చించారు. మున్సిపల్ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలని అధికార యంత్రాంగానికి సీఎం సూచించారు.

మే చివర్లోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే వివిధ కారణాలతో ఇది వాయిదాపడుతూ వచ్చింది. పలు మున్సిపాలిటీలకు సంబందించి కోర్టుల్లో కేసులు ఉండటం వల్ల మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతోంది. తాజాగా కేసుల పరిధిలో లేని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకట్రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వనున్నారని తెలిసింది.

Related posts

Leave a Comment