మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య..

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చిన్నారి హత్య కలకలం రేపింది. చల్లపల్లిలో 3వ తరగతి చదువుతున్న బాలుడి దారుణ హత్యకు గురయ్యాడు.చల్లపల్లి బీసీ హాస్టల్ లో మూడో తరగతి చదువుతున్న దాసరి ఆదిత్యను హాస్టల్ బాత్ రూమ్‌లో హత్యకు గురయ్యాడు. దీంతో ఘటన స్థలానికి

చెందిన పోలీసులు కేసు నమోదు చేశారు.నిందితులు ఎవరన్న దానిపై విచారణ చేపట్టారు. హాస్టల్ సిబ్బందితో పాటు తోటి విద్యార్థుల్ని కూడా విచారిస్తున్నారు. మరోవైపు అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి హత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు

Related posts

Leave a Comment