ఆనుమానం ఓ ప‌చ్చ‌ని సంసారంలో చిచ్చు

suside

ఆనుమానం అనే పెను భూతం ఓ ప‌చ్చ‌ని సంసారంలో చిచ్చు రేపింది.. ఐదు సంవ‌త్స‌రాలు కాపురం చేసిన భార్య, భర్త‌ల‌ మ‌ధ్య అగాథం సృష్టించింది. ఫలితంగా ఒకరి ప్రాణం పోగా… మరొకరు జైలు పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుందీ ఘటన, నస్రుల్లాబాద్‌ మండల

కేంద్రానికి చెందిన జ్యోతికి , నిర్మల్‌ జిల్లా కడెం గ్రామానికి చెందిన రాజుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. కొన్ని నెలల నుంచి రాజు తన భార్యపై అనుమానం పెంచుకొన్నాడు. అప్పట్నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడు.

గొడవలు ముదరడంతో కులపెద్దలు కూర్చోపెట్టి దంపతులిద్దరి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో భార్యాభర్తలిద్దరూ గత కొద్ది రోజులుగా నస్రుల్లాబాద్‌లోనే ఉంటున్నారు. జులై 29న ఇద్దరి మధ్య మరోసారి ఘర్షన తలెత్తింది. దీంతో రాజు, జ్యోతిని తీవ్రంగా కొట్టి గాయపరిచి గొంతు నులిమి చంపే ప్రయత్నం

చేశాడు. ఈ సమయంలో జ్యోతి సోదరి స్వాతి గుర్తంచి వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలవడంతో భర్త పారిపోయాడు. తీవ్రగాయాలపాలైన జ్యోతిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది.

దీంతో తన అక్క జ్యోతి మృతిపై సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భర్త రాజు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. తల్లి మరణించి… తండ్రి ఎక్కడున్నాడో తెలియక ఆ పిల్లలు బోరున విలపిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ దూరమవ్వడంతో అనాథలుగా మారిన

చిన్నారుల్ని చూసి చుట్టుపక్కలవాళ్లు కంటతడి పెట్టుకుంటున్నారు. ఆనుమానం అనే పిశాచి ప‌చ్చ‌గా నడుస్తున్న వారి సంసారంలో నిప్పులు పోసిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Related posts

Leave a Comment