నయీం కేసులో ఆ టీఎర్ఎస్ నేత పేరు ఎందుకు లేదు?

గ్యాంగ్ స్టర్ నయీం కేసుకు సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పెట్టుకున్న సమాచార హక్కు దరఖాస్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అయితే, మరికొన్ని సంచలన విషయాలు వెలుగుచూడలేదనే ప్రచారం కూడా జరుగుతోంది. గ్యాంగ్‌స్టర్ నయీంతో 16 మంది టీఆర్ఎస్ నేతలు,

17 మంది పోలీసు అధికారులకు దోస్తీ ఉన్నట్టు పోలీసులు తెలిపిన వివరాల్లో ఉన్నాయి. అందులో మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేరు కూడా ఉంది. అయితే, ఆ ఆర్టీఐ రిపోర్ట్ చూసిన వారికి ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు. అందులో ఓ టీఆర్ఎస్ ముఖ్యనేత పేరు అదృశ్యమైంది. తెలంగాణ

శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్ పేరు కనిపించకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నల్లగొండ జిల్లాకు చెందిన నేతి విద్యాసాగర్ .. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో నేతి విద్యాసాగర్ శాసనమండలి చైర్మన్‌గా ఉన్నారు.

గ్యాంగ్ స్టర్ నయీంతో నేతి విద్యాసాగర్‌కు సంబంధాలు ఉన్నాయని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొన్ని ఆడియో టేపులు కూడా బయటపడ్డాయి. నేతి విద్యాసాగర్‌ను చైర్మన్ పదవి నుంచి తప్పిస్తారంటూ కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఓ దశలో ఆయనే రాజీనామా చేస్తారని కూడా

టాక్ వచ్చింది. అయితే, కొన్నాళ్లు కేసు మెల్లమెల్లగా ప్రజల మైండ్‌లో నుంచి చెరిగిపోయింది. అయితే, తాజాగా ఆర్టీఐ తెలిపిన వివరాల్లో నేతి విద్యాసాగర్ పేరు కనిపించకపోవడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతోపాటు నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అతడి వద్ద ఎంత డబ్బు, ఆస్తులు బయటపడ్డాయనే అంశంపై సమాచారం రాలేదు.

Related posts

Leave a Comment